షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధినీ, విద్యార్ధులతో కలిసి సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి నాదెండ్ల మనోహార్ భోజనం చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విద్యార్ధినీ, విద్యార్ధులకు స్వయంగా వంటకాలు వడ్డించడంతో విశేషం చోటు చేసుకుంది. అనంతరం కాసేపు విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.