ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటి బుధవారం పవర్ పేటలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వెంటనే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది.