ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అమరావతి సచివాలయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో విస్తృతంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణ, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి, రోడ్ల మరమ్మతులు, నీటి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ ఆసుపత్రి ఆధునికీకరణ వంటి కీలక అంశాలపై వినతిపత్రం సీఎంకు అందజేశారు.