కేంద్ర మంత్రులతో చర్చలలో భాగంగా ఈరోజు ఢిల్లీకి విచ్చేసిన విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ కు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం నారా లోకేష్ తో కలిసి కేంద్ర మంత్రులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.