భూముల రీ సర్వేకు సంబంధించి అర్జీలను ప్రణాళిక బద్ధంగా జనవరి 31వ తేదీలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డితో కలిసి రెవిన్యూ అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ, భూసేకరణ, రీసర్వే అంశాలపై సమీక్షించారు.