జంగారెడ్డిగూడెం స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జరిగిన లోక్ అదాలత్ న్యాయ విజ్ఞాన సదస్సు ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 308 కేసులు పరిష్కారం అయినట్టు జూనియర్ సివిల్ జడ్జి సీ.హెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. కిషోర్ కుమార్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఐపీసీ కేసులు, బి.ఎస్.ఎన్.ఎల్, ఎం.సీ, చెక్కు బౌన్స్ తదితర విభాగాలు ఉన్నాయని వివరించారు.