ఏలూరు: మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన అధికారులు

55చూసినవారు
ఏలూరు: మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన అధికారులు
పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందించే పౌష్టికాహారాన్ని తహశీల్దార్ నాగరాజు, విద్యా శాఖ అధికారులతో కలిసి గురువారం పాఠశాలల్లో తనిఖీ చేసారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫోర్టిఫైడ్ సన్న బియ్యంతో అందిస్తున్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. ఎంఈవో సురేష్ బాబు, వెంకటేశ్వరరావులతో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్