ఏలూరు: పోలవరం నుండి నీటిని విడుదల చేసిన అధికారులు

822చూసినవారు
ఏలూరు: పోలవరం నుండి నీటిని విడుదల చేసిన అధికారులు
ఏలూరు: ఎగువ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీవర్షాలకు గోదావరి ఉపనదుల జలాలు గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది. శనివారం పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుండి 1,87,051 క్యూసెక్కుల అదనపు జలాలను దిగువకు విడుదల చేసినట్లు జలవనరులశాఖ తెలిపింది. స్పిల్ వే ఎగువన 27.920 మీటర్లు, దిగువన 18.470 మీటర్లు, ఎగువ కాపర్ డ్యాంకి ఎగువన 28.050 మీటర్లు, నీటిమట్టం నమోదయ్యింది.

సంబంధిత పోస్ట్