ఏలూరు మండలం ఏలూరు మాదేపల్లి సెక్షన్ పరిధిలో ఉన్న 33/11 కెవి సుంకరివారితోట సబ్ స్టేషన్ లో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేద్కర్ తెలిపారు. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 వరకు మాదేపల్లిరోడ్, సుంకరివారితోట, ప్రేమలయం, గాయత్రినగర్, జాలిపూడి, లింగరావుగూడెం, కాట్లంపాడు, శ్రీపర్రు, మనూరు, ఎం. ఎచ్. పురం, కలకుర్రు గ్రామాలకు సరఫరా నిలిచిపోతుందన్నారు. కావున విద్యుత్తు వినియోగదారులు సహకరించాలన్నారు.