ప్రజల నుంచి అర్జీల రూపంలో వచ్చే సమస్యల పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా నిర్దేశించుకుని, అందుకు తగిన విధంగా ప్రణాళికతో పనిచేస్తున్నట్లు ఎంపీ మహేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఏలూరు శాంతినగర్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపీ మహేష్ యాదవ్ 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీకి అర్జీలు సమర్పించారు.