కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టీయు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ రంగ కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ బద్దా వెంకట్రావు మాట్లాడుతూ.. గడిచిన 2019 సంవత్సరం నుండి భవన ఇతర నిర్మాణ కార్మికుల యొక్క చట్ట రూపంలో ఏర్పడిన సంక్షేమ బోర్డును నడిపించడం లేదన్నారు.