ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్. ఆర్ పేటలోని తన నివాసంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. ఎమ్మెల్యేకు సమస్యలను వివరించి అర్జీలు అందించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కరించటమే ధ్యేయంగా పనిచేస్తున్నానమన్నారు.