ఏలూరు: కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి: ఏఐటీయుసీ

66చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయుసీ డిమాండ్ చేసింది. ఏఐటీయుసీ జాతీయ కౌన్సిల్ నిర్ణయం మేరకు గురువారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా కార్యదర్శి కే బుచ్చిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నో పోరాటాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించారని, అడుగడుగున ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్