ఏలూరు: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష

76చూసినవారు
ఏలూరు: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష
ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన బుధవారం జడ్పీ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ద్వారా మంజూరు చేయబడిన పంచాయతీ రాజ్ అభివృద్ధి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గ్రామీణ అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్