ఏలూరు: విమానం కూలిన ఘటనపై దిగ్బ్రాంతి

65చూసినవారు
ఏలూరు: విమానం కూలిన ఘటనపై దిగ్బ్రాంతి
అహ్మదాబాదులో గురువారం లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాద ఘటన ద్రిగ్భాంతికి గురిచేసిందని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఇన్ చార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్