ఉద్యోగంపై ఆశతో ఏలూరులో డీఎస్సీ పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు అభ్యర్థులు దొంగల చేష్టలకు బలయ్యారు. పరీక్ష కేంద్రం వద్ద డిక్కీలో ఫోన్లు, ఏటీఎం కార్డులు ఉంచి లోపలికి వెళ్లగా, దుండగులు సిమ్ లు, ఏటీఎం కార్డులు తీసుకొని వాటిని ఉపయోగించి రూ.80 వేలు కాజేశారు. అనంతరం ఫోన్, కార్డులు యథాస్థానంలో ఉన్నప్పటికీ డబ్బు మాయమవడంతో బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.