ఏలూరు: కత్తులతో దాడి ఘటనలో ఆరుగురు అరెస్ట్

84చూసినవారు
ఏలూరు: కత్తులతో దాడి ఘటనలో ఆరుగురు అరెస్ట్
ఏలూరు లోని స్థానిక న్యాయస్థానం కూడలి సమీపంలో రెండ్రోజుల క్రితం కత్తులు, రాడ్డులతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఫిరంగుల దిబ్బకు చెందిన ఇబ్బా వెంకటేశ్వరరావు, కె. వెంకటేశ్వరరావు మధ్య సరిహద్దు వివాదం ఉన్నా నేపధ్యంలో గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో గురువారం నాగరాజు, వరప్రసాద్, బాలాజీ, వెంకట త్రినాథ్, వెంకటరమణ, నాగలక్ష్మిలను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్