వ్యసనాలకు బానిసైన ఓ కుమారుడు మద్యం కోసం డబ్బులివ్వలేదని కన్న తల్లిని కిరాతకంగా చంపాడు. తడికలపూడి పోలీసుల మేరకు– తాడిచెర్ల గ్రామానికి చెందిన విజయలక్ష్మి (65) టీ కొట్టు నడుపుతూ జీవనం సాగించేది. ఆమె కుమారుడు వెంకటరావు డబ్బుల కోసం తరచూ వేధించేవాడు. 2024 ఫిబ్రవరి 11న మద్యం కోసం అడిగితే తిరస్కరించడంతో, తలపై కొబ్బరి చెక్క పీటతో కొట్టి చంపేశాడు. దీంతో కోర్టు ఆయనకు మంగళవారం యావజ్జీవ శిక్ష విధించింది.