ఏలూరు: పోలీసుల సంక్షేమం కోసం స్పెషల్ కూలర్లు

62చూసినవారు
ఏలూరు: పోలీసుల సంక్షేమం కోసం స్పెషల్ కూలర్లు
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలీస్ సిబ్బందికి వేసవి కాలంలో ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం గార్డ్ డ్యూటీలో ఉన్న సిబ్బందికి 13 క్రాంప్టన్ ఎయిర్ కూలర్లు పంపిణీ చేశారు. వేడి తీవ్రత దృష్ట్యా సిబ్బంది ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సిబ్బంది అభినందించారు. తమ సంక్షేమం కోసం ఎస్పీ చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్