గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం శ్రవణా నక్షత్ర సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నెల్లూరు రవికుమార్ ఆచార్యులు నేతృత్వం వహించారు. హైదరాబాదుకు చెందిన బలిసట్ల చలమయ్య దంపతులు ఉభయ దారులుగా పాల్గొన్నారు. సెలవు రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.