ఏలూరు జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమం చేపట్టాలని రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం పిలుపునిచ్చింది. శుక్రవారం ఏలూరు పవర్ పేటలోని అన్నే భవనంలో రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం సంఘం అధ్యక్షులు కట్టా భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని, కౌలు రైతులకు పంటలు ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేశారు.