భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఏలూరు 27వ డివిజన్ నందు ఏరియా సమితి సభ్యులు కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి ఇవ్వాలని గురువారం అర్జీల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.