ఏలూరు: భీమడోలు-ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారికి తూట్లు పడ్డాయి. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రుళ్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రధానంగా ద్వారకా తిరుమలలోని నిమ్మకాయల మార్కెట్ యార్డు వద్ద, క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలోని మలుపులో, సూర్యచంద్ర రావుపేట చెరువు వద్ద, గొల్లగూడెం సెంటర్, పంగిడిగూడెం వద్ద రోడ్డు ధ్వంసమైంది. వర్షం నీటితో నిండి భారీ గుంతలు భయపెడుతున్నాయి.