ఏలూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఆదివారం కొల్లేరు సంఘ నాయకులతో కలిసి దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కొల్లేరు చేపల చెరువుల తవ్వకాలకు సంబంధించి కొల్లేరు వాసులనుండి అక్రమంగా వసూలు చేసిన కోట్లాది రూపాయల లీజు సొమ్ములు తిరిగి చెల్లించే వరకు వదిలే ప్రసక్తి లేదని కొల్లేరు సంఘ నాయకులు హెచ్చరించారు.