ఏలూరు సాక్షి కార్యాలయంపై ఎటువంటి దాడి జరగలేదని మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. సాక్షి కార్యాలయం వద్ద పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆ కార్యాలయం వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఫర్నిచర్ సంస్థకు సంబంధించి పర్నిచర్‌ను తగులబెట్టారన్నారు. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేశారన్నారు.