ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. గత నెల 21న దుగ్గిరాల హైవే సర్వీస్ రోడ్డు ప్రాంతంలో ఈ వ్యక్తి స్పృహ తప్పి ఉన్నాడు. అతడిని 108లో ఏలూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిస్తే ఏలూరు 3టౌన్ పోలీస్ స్టేషన్ 9347776667 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.