దెందులూరు లో రక్షక సిబ్బంది తనిఖీలు చేశారు. చేపల చెరువులకు తరలిస్తున్న చికెన్ వ్యర్ధాల వాహనంను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసారు. శనివారం తనిఖీల్లో భాగంగా చికెన్ వ్యర్ధాలతో వెళుతున్న బొలెరో వ్యాన్ ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ టు గుండుగోలను వైపు వెళ్తున్న ఏపీ 39 యు సి 13 29 గల వ్యాను కోడి వ్యర్ధాలు వేసుకుని నకిలీ బిల్లులతో వెళుతుండగా ఎస్ఐ శివాజీ తనిఖీలు నిర్వహించారు.