ఏలూరు విద్యానగర్ లోని శిశుగృహాన్ని మంగళవారం ఉమ్మడి ప.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ సందర్శించారు. అక్కడ ఉన్న బాలబాలికల ఆరోగ్య పరిస్థితి, ఆహార వ్యవస్థలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి, సొంత బిడ్డల్లా శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.