కేంద్రంలో వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏలూరులో జరిగిన ముస్లింల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లు వల్ల ఎటువంటి నష్టం లేదని కావున ముస్లింలు ఎవరూ కూడా అధైర్య పడకండి, అన్ని విధాల ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని అన్నారు.