వక్ఫ్ బోర్డ్ 2025 చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నాయకులు ముక్త కంఠంతో బిల్లును వ్యతిరేకించారు. శనివారం సిపిఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో వక్ఫ్ బోర్డ్ 2025 చట్ట సవరణను వ్యతిరేకిస్తూ సిపిఐ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విశ్రాంతి జడ్జి అడబాల లక్ష్మి అధ్యక్షత వహించారు.