ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశం శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ సీఈఓ కె. భీమేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జరుగుతుందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొనాలన్నారు.