'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమాన్ని ఏలూరు మూడో డివిజన్‌లో శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. పర్యటనలో మహిళలు తమ సమస్యలను ఆయనకు చెప్పగా, ఆ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు.