సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆదివారం ఏలూరులోని అంబికా థియేటర్లో అభిమానులతో సందడి చేశారు. ఇటీవల నాగచైతన్య నటించిన తండేల్ చిత్ర విజయోత్సవంలో భాగంగా చిత్ర యూనిట్ ఏలూరు వచ్చారు. హీరో నాగచైతన్య తండేల్ సినిమాలోని డైలాగ్‌ను చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు. తన నుంచి మరెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తాయని అన్నారు.