కోడిపందేలు నిర్వహించాలంటే భయపడేలా అధికారుల చర్యలు ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా, మండలస్ధాయి, అధికారులు, పోలీసు, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో స్ధానిక కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ కె. పి. ఎస్ కిషోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోడిపందేలు, జూదం, గుండాట, మద్యం అక్రమ రవాణాపై నిరంతర గట్టి నిఘా పెంచాలన్నారు.