ఏలూరులో ఈనెల 3 నుండి 21 వరకు జరగనున్న టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ అబ్రహం తెలిపారు. ఈ పరీక్షలకు ఏలూరులో కేటాయించిన రెండు పరీక్ష కేంద్రాలకు సంబంధించి 5670 మంది హాజరవుతారని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే సహాయ కేంద్రం నంబర్లకు 8328186618, 9030723444 సంప్రదించాలన్నారు.