విజయవాడ వరద బాధితులకు సహాయార్థ నిమిత్తం సుమారు 10000 వేల మందికి పైగా బాధితులకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో గురువారం పార్టీ కార్యాలయం నుండి ఆహారం పంపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మానవత దృక్పధంతో వరద ముంపు ప్రాంత బాధితులకి ఆహారాన్ని అందించేందుకు బయలు దేరిన జనసైనికులను, ఇతర నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలను అభినందిస్తున్నామని అన్నారు.