ఏలూరు కలెక్టర్ ను కలిసిన జంగారెడ్డిగూడెం చిన్నారులు

62చూసినవారు
ఏలూరు కలెక్టర్ ను కలిసిన జంగారెడ్డిగూడెం చిన్నారులు
చిన్నారులపై మారుటి తండ్రి జరిపిన పాశవిక దాడి చూసి కలెక్టర్ కె వెట్రిసెల్వి బుధవారం చలించి పోయారు. వారికి విద్య, వైద్యం, అందించేందుకు. ముందుకు వచ్చారు. ఏలూరుకు తీసుకువచ్చిన పిల్లలను అక్కున చేర్చుకుని వారిలో మనోధైర్యం నింపే విధంగా మాట్లాడారు. ఇటీవల జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అన్నా చెల్లెళ్లను మారుటి తండ్రి చిత్రహింసలు గురి చేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని ఆసుపత్రిలో చికిత్స చేశారు.

సంబంధిత పోస్ట్