భీమడోలు టీడీపీ మండల అధ్యక్షుడిగా కరణం

71చూసినవారు
భీమడోలు టీడీపీ మండల అధ్యక్షుడిగా కరణం
భీమడోలు టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ భీమడోలు మండల అధ్యక్షుడిగా కరణం పెద్దిరాజుని, ప్రధాన కార్యదర్శిగా అడ్డగర్ల వెంకటరత్నాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఇచ్చిన పదవిని బాధ్యతగా సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్