మే 20వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని గత కొన్ని రోజులుగా ఏలూరులో ఉద్యోగులు, కార్మికుల పని ప్రదేశాలలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఏలూరులో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా గురువారం ఉదయం కోటదిబ్బ ఎస్. ఆర్ సర్కిల్ వద్ద ది జోనల్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.