ఏలూరు: కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి వెళితే తిరిగి వచ్చేసరికి ఇల్లు దోచేశారు. దక్షిణపు వీధి ప్రాంతానికి చెందిన ఐ భాస్కరరావు తన కుటుంబ సభ్యులతో ఆదివారం పెద్ద తిరుపతి పరిసర ప్రాంతాలకు వెళ్లి శుక్రవారం వచ్చేసరికి ఇంటిలో ఉన్న 15 కాసుల బంగారం, 3 లక్షల నగదు దొంగలు దోచుకునిపోయారు. గమనించిన భాస్కరరావు ఏలూరు ఒకటో పట్టణ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.