జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏలూరు రూరల్ ఎస్ఐ దుర్గ ప్రసాద్, డీటీఆర్బీ మధు, రోడ్ సేఫ్టీ సిబ్బందితో కలిసి ఆశ్రమ హాస్పిటల్ వద్ద జాతీయ రహదారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నేషనల్ హైవేలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే లక్ష్యంతో, ఏలూరు, ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వద్ద జాతీయ రహదారి పై ఓవర్ స్పీడ్‌గా వెళ్లే వాహనాలపై దృష్టి సారించారు.