ఏలూరు నగరంలోని స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మంగళవారం అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. అలాగే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.