కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 22 కోట్లతో ఏలూరు రైల్వేస్టేషన్ లో చేపట్టిన ఆధునికీకరణ పనులను ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏలూరు రైల్వే స్టేషన్ లో అడుగుపెట్టగానే ఆధునికత, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆధునికీకరణ పనులు చేపట్టాలని రైల్వే అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే పనుల పురోగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.