పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు హైవే రోడ్ లో ప్రమాదం జరిగింది. బొలెరో వ్యాన్ అదుపుతప్పి ఉపాధి హామీ కూలీలపైకి దూసుకుపోయింది. దీంతో పంట బోదెలో పని చేస్తోన్న ఉపాధి హామీ కూలీలు ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే అంబులెన్స్ లో నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. సంఘటన స్థలాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు.