గోదావరి న‌దిలో తల్లీ, కుమారుడు గల్లంతు

67చూసినవారు
గోదావరి న‌దిలో తల్లీ, కుమారుడు గల్లంతు
ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరేపాడు మండలం కట్కూరు వద్ద గోదావరిలో తల్లీ, కుమారుడు గల్లంత‌య్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన అల్లంశెట్టి నాగమణి (48), కుమారుడు తేజ శ్రీనివాస్‌ (23) న‌దిలో గల్లంత‌వ్వ‌గా.. వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి కట్కూరు శివాలయానికి 14 మంది భక్తులు వెళ్ల‌గా.. వీరిలో నాగమణి, తేజ శ్రీనివాస్ నీటిలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్