ఏలూరులో ముస్లిం సోదరులు భారీ నిరసన ర్యాలీ

54చూసినవారు
ఏలూరులో ముస్లిం సోదరులు భారీ నిరసన ర్యాలీ
వక్ఫ్ సవరణ బిల్లు ను పార్లమెంటులో ఆమోదించడాన్ని నిరసిస్తూ ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో కర్బలా మైదాన్ వద్ద జేఏసీ నాయకులు ప్రారంభించారు. పవర్ పేట గేట్ రోడ్డు, రామచంద్రరావు పేట, గవర్నమెంట్ హాస్పిటల్, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్