తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కి ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్ ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు.