ఏలూరు జిల్లాలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యధావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆయా కారణాలతో ఆయా వేదికలకు రాలేని ప్రజలు https: //meekosam. ap. gov. in వెబ్ సైట్ ద్వారా తమ అర్జీలు పొందుపర్చాలన్నారు.