ఏలూరు జిల్లా పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కుంకాల గ్రామానికి చెందిన గిరిజన మహిళ శిరీష ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. కొంతసేపటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నర్సులు చికిత్స అందించడంతోనే శిరీష మృతి చెందిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. శిరీష మృతదేహాంతో ఆసుపత్రి బయట ఘోరంగా విలపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.