గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య నీరు చేరుతుంది. పంపులు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు కాలువలు తీయగా, పంపుల ద్వారా నీటిని తిరిగి గోదావరిలోకి వదులుతున్నారు. శుక్రవారం సాయంత్రానికి స్పిల్వే వద్ద నీటి మట్టం 27.76 మీటర్లకు చేరగా, 48 గేట్ల ద్వారా 1.70 లక్షల క్యూసెక్కులు నీరు విడుదల చేశారు. సిద్ధాంతం వద్ద ప్రవాహం పెరుగుతుండటంతో వరద మరింత పెరిగే అవకాశం ఉన్నదని తహసీల్దారు అనిత కుమారి తెలిపారు.